Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ 5వ అంతస్తు నుండి కూలిన పట్టీ

Update: 2025-02-12 16:07 GMT

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ 5వ అంతస్తు నుండి కూలిన పట్టీ

తెలంగాణ సచివాలయంలో 5వ అంతస్తులో ఏర్పాటు చేసిన పట్టీ పెచ్చులూడి కిందపడింది. ఆ పట్టీ కూలిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, కూలిన పట్టీ వచ్చి రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడింది. ఈ ఘటనలో ఆయన కారు ముందు భాగం ధ్వంసమైంది.

పట్టీ కూలిన తీరు చూస్తే... ప్రస్తుతానికి కొంత భాగమే కూలినప్పటికీ, వెంటనే మరమ్మతులు చేయకపోతే మిగతా భాగం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే నిర్మించిన కొత్త భవనం ఇది.  

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News