KTR: కేంద్ర మంత్రులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు
KTR: అందరూ ఒకే అబద్ధం చెప్పేలా మోడీ ట్రైన్ చేయాలని కేటీఆర్ ట్వీట్
KTR: కేంద్ర మంత్రులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు
KTR: తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి KTR ట్విటర్‌లో స్పందించారు. మంత్రులు చెప్పే విషయాలు అబద్దాలని.. కనీసం అబద్ధాలైనా అందరూ ఒకేలా చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణకు మెడికల్ కాలేజీల విషయంలో CM KCRను విమర్శించడంపై KTR కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణకు తొమ్మిది కళాశాలలు ఇచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారని.. అసలు తెలంగాణ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని మాన్సుక్ మాండవీయ అంటున్నారని KTR సెటైర్ వేశారు. మరోవైపు రెండు ప్రతిపాదనలు వచ్చాయని నిర్మలా సీతారామన్ అంటున్నారని చెప్పారు. ముగ్గురు చెరో మాట చెబుతున్నారని అబద్ధాలు చెప్పేటప్పుడైనా అందరూ ఒకే మాట మీద ఉండాలి కదా అని KTR చురకలంటించారు.