Ts Inter Academic Calendar : ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల...దసరాకి, సంక్రాంతికి సెలవులు ఎన్నిరోజులంటే

Update: 2020-09-10 11:12 GMT

Ts Inter Academic Calendar : కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ తరగతులను పున: ప్రారంభించేందుకు ఇంటర్ బోర్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు జూనియర్‌ కాలేజీల అకడమిక్‌ క్యాలెండర్‌ను నేడు విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో కళాశాలలకు మొత్తం 182 పనిదినాలుగా ఖరారు చేసింది. ప్రతి ఏడాది దసరా సమయంలో పది రోజుల కంటే ఎక్కువగా ఇచ్చే సెలవుదినాలను కూడా 3 దినాలకు కుదించింది. అదే విధంగా సంక్రాంతి పండగకు కేవలం 2 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2021లో మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. 2021 ఏప్రిల్‌ 16ను అకడమిక్‌ ఇయర్‌ లాస్ట్‌ వర్కింగ్‌ డే గా ఖరారు చేసింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు ఇంటర్ ప్రవేశాలు జరగకపవడంతో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ప్రవేశాలపై అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక మరో వైపు తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్-2020) ఫలితాలు గురువారం వెలువడ్డాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులు విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.polycetts.nic.inలోకి వెళ్లి ఫలితాలను చూసుకోవచ్చు.

ఇక టీఎస్ పాలిసెట్-2020 ప్ర‌వేశాల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొద‌టి విడుత ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌ర‌గనుంది. 12 నుంచి 17వ తేదీ వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 14 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 14 నుంచి 20వ తేదీ వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. 22న సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. ఇక సీట్లు సొందిన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి సెల్ప్‌ రిపోర్ట్‌ చేయాలి. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్ర‌వేశాల ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. 30వ తేదీన‌, అక్టోబ‌ర్ 1న వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. అక్టోబ‌ర్ 3న తుది విడుత ప్ర‌వేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు చేస్తారు. అక్టోబర్‌ 7 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిష‌న్ల‌కు అక్టోబ‌ర్ 8న మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయనున్నారు.

Tags:    

Similar News