తెలంగాణ‌లో సెప్టెంబరు 1 నుంచి కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాస్‌లు..

తెలంగాణ‌లో సెప్టెంబరు 1 నుంచి కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాస్‌లు..
x
Highlights

Online Classes for College Students in Telangana: కరోనా కారణంగా మధ్యంతరంగా ముగిసిన విద్యార్థుల చ‌దువులు పునఃప్రారంభం కానున్నాయి....

Online Classes for College Students in Telangana: కరోనా కారణంగా మధ్యంతరంగా ముగిసిన విద్యార్థుల చ‌దువులు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లోనూ సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం అవుతాయ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. అలాగే పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా డిజిట‌ల్ బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు.

అధ్యాప‌కులు ఈ నెల‌ 27 నుంచే కళాశాలల‌కు వెళ్ళాల‌ని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న‌ రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా వుండ‌గా వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. సుప్రీంకోర్టు కేసు తేలిన తర్వాత డిగ్రీ, యూజీ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మరోవైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని ప్రవేశపరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.




Show Full Article
Print Article
Next Story
More Stories