Telangana: హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.. డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారులు ఏపీకా.. తెలంగాణకా..?
IAS, IPS Officers Quota: తెలంగాణలోని ఆలిండియా సర్వీస్ అధికారుల్లో టెన్షన్ నెలకొంది.
Telangana: హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ.. డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారులు ఏపీకా.. తెలంగాణకా..?
IAS, IPS Officers Quota: తెలంగాణలోని ఆలిండియా సర్వీస్ అధికారుల్లో టెన్షన్ నెలకొంది. ఐఏఎస్ అధికారుల క్యాడర్ కేటాయింపులపై ఇవాళ టీఎస్ హైకోర్టులో విచారణ జరగనుంది. డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది అధికారుల కేటాయింపులపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ జరగనుంది. 12 మంది ఆలిండియా సర్వీస్ అధికారుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే సోమేష్‌కుమార్‌ను టీఎస్ హైకోర్టు ఏపీకి పంపింది.
2016లో కేంద్ర కేటాయింపులను క్యాట్ సవాల్ చేసి.. తెలంగాణలో కొనసాగుతున్నారు అధికారులు. అయితే.. క్యా్ట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. సోమేష్‌కుమార్ కేసుతో ఈ కేసుకు పోలిక లేదంటున్న అధికారులు.. తమ అభ్యంతరాలు వినాలని హైకోర్టును కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.