Formula -E Car Race Case: కేటీఆర్‌ కు మరోసారి హైకోర్టులో ఊరట

Update: 2024-12-27 08:12 GMT

Formula -E Car Race Case: కేటీఆర్‌ కు మరోసారి హైకోర్టులో ఊరట

Telangana High Court Relief for KTR in Formula -E Car Race Case

ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో (Formula -E Car Race) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు మరో రోజు మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఫార్మూలా- ఈ కారు రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారించింది. ఈ నెల 20న కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఏసీబీ(ACB)ని ఆదేశించింది.డిసెంబర్ 27న ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ నెల 31 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ

ఈ కేసులో హైకోర్టులో ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. మరో వైపు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు.ఈ పిటిషన్ పై కేటీఆర్ ను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఈ పిటిషన్ పై విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది కోర్టు.

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా ఉన్న ఆదేశాలతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆ పిటిషన్ లో ఏసీబీ తెలిపింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ కోరుతోంది. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరు చేసినా, ఆయనకు ఎలాంటి రిలీఫ్ ఇచ్చినా విచారణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో ఏసీబీ అధికారులు చెప్పారు.ఈ కారణంతో కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు.

Tags:    

Similar News