మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘటనలను కవర్ చేసేందుకు వెళ్లిన
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా.. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మోహనబాబు అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషన్ పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.