High Court hearing demolition of Osmania Hospital : ఎర్రమంజిల్ కు ఇచ్చిన తీర్పు ఉస్మానియా ఆసుపత్రికి వర్తిస్తుంది

Update: 2020-09-08 08:16 GMT

High Court hearing demolition of Osmania Hospital : రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అత్యాధుని వైద్య సేవలను అందిస్తారు ఉస్మానియా వైద్యులు. ఎంతో మంది ప్రాణాలను కపాడుతున్న ఈ ఆస్పత్రి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో దాన్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించేందుకు కదం తొక్కుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని హై కోర్టులో కౌంటర్ ధాఖలు చేసింది. ఇప్పటికే ఈ కౌటర్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ రోజు మరోసారి విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆసుపత్రి పై ఇప్పటి వరకు ధాఖలైన అన్ని పిటిషన్లను కలిపి నేడు మరోసారి విచారించనున్నది హై కోర్టు.

ఈ క్రమంలోనే కొంత మంది పిటిషనర్లు ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనం పురాతన కట్టడం అని దానిని కూల్చివేయ్యద్దని వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఎర్రమంజిల్ భవనంపై ఇచ్చిన తీర్పును గురించి పిటిషనర్లు ప్రస్తావించారు. ఉస్మానియా ఆసుపత్రికి ఎర్రమంజిల్ కు ఇచ్చిన తీర్పువర్తిస్తుందని పిటీషనర్లు వాదనలు వినిపించారు. అంతే కాదు న్యాయస్థానం ఉస్మానియాకు సంబంధించిన గూగుల్ సైట్ మ్యాప్ ఇవ్వాలని గతంలో కోరింది. దీంతో ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు కు ఆ మ్యాప్ సమర్పించనుంది.

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి. ఈ ఆసుపత్రి తెలంగాణ రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ లో ఉంది. ఈ భవనానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. భారత దేశంలోని పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఆ ఆస్పత్రిని నిర్మించారు. ఆ తరువాత అతని పేరు మీద ఈ ఆస్పత్రి ప్రసిద్ధికెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయ్యాక సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి తెలంగాణా ప్రభుత్వము ద్వారా నడుపబడుతున్నది. ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ, 685 సాధారణ పడకలు. ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి రెండు టవర్లతో అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News