వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డిపై సోమవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను హార్డ్ డిస్క్ రూపంలో కోర్టుకు సమర్పించాలని సీబీఐని కోరింది. అంతకుముందు వివేకా హత్య కేసులో హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించే సమయంలో విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించలేదనే అభియోగాలున్నాయని హైకోర్టు పేర్కొంది. మొత్తం రికార్డులు, ఫైల్స్ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సోమవారం నాటి ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని కోరింది.
మరో వైపు అవినాష్‌రెడ్డి పిటిషన్ విచారణలో హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీపీ కెమెరాల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. కోడి కత్తి కేసులో ఎయిర్‌పోర్టులో 30 కెమెరాలు పనిచేయడం లేదని సీఐఎస్‌ఎఫ్ కోర్టు తెలిపిందన్నారు. సీబీఐ ఆఫీస్‌లో సీసీ కెమెరాలు బిగించాలన్న స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో లభించిన లెటర్‌ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.