Telangana: సీఎస్ సోమేష్‌కు బిగ్ షాక్.. ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Telangana: సీఎస్ సోమేష్‌కు బిగ్ షాక్.. ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Telangana: సీఎస్ సోమేష్‌కు బిగ్ షాక్.. ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు కీలక ఆదేశాలు..
Telangana: తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. కాగా రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయవాది అభ్యర్ధనతో కోర్టు తీర్పు 3 వారాల పాటు నిలిపివేశారు. దీనిపై సీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.