Telangana School Holidays: రేపు తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవు
Telangana School Holidays: భారీ వర్షాలు, వరదల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు . అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఈరోజు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్
Telangana School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికి వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
భారీ వర్షాలు, వరదల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు . అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులతోపాటు మంత్రులు కూడా 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. పలుచోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని చెప్పారు. వరద ఉన్నచోట ఎవరూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటికి రావొద్దని మంత్రి తెలిపారు.