Telangana: ఆర్టీసీ కార్మికుల నిరసన.. మధ్యాహ్నం వరకు ప్రభావం
Telangana: రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు
Telangana: ఆర్టీసీ కార్మికుల నిరసన.. మధ్యాహ్నం వరకు ప్రభావం
Telangana: తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై వైఖరిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ తీరును నిరసిస్తూ.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు థామస్ రెడ్డి ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం అన్ని జిల్లాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య బస్సులు నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. అలాగే నిరసనలో భాగంగా..ఉదయం11 గంటలకు రాజ్ భవన్ ముట్టడించేందుకు ప్రదర్శనగా వెళ్లాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం ఆర్టీసీ కార్మికులందరూ పీవీ నరసింహారావు మార్గంలోని పీపుల్స్ ప్లాజా చేరుకోవాలని, అక్కడినుంచి గవర్నర్ వైఖరిని నిరసిస్తై ప్రదర్శనగా రాజ్ భవన్ చేరుకుని ఆవేదన వ్యక్తంచేయాలని థామస్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేబినెట్ లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని TMU నేత థామస్ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో ఉన్న 43వేల 373 మంది కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ఆ బిల్లును గవర్నర్ కు పంపడం జరిగిందని, కానీ.. గవర్నర్ ఇప్పటివరకు ఆ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య అన్న థామస్ రెడ్డి.. గవర్నర్ ఓ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ జీవితాలలో వెలుగులు నింపే ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామని, అవసరమైతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు TMU నేత థామస్ రెడ్డి.