Meerpet: పెళ్లికి నిరాకరించాడని.. మీర్‌పేట్ లో యువతి ఆత్మహత్య

Meerpet: రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందని మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది.

Update: 2025-12-22 09:26 GMT

Meerpet: పెళ్లికి నిరాకరించాడని.. మీర్‌పేట్ లో యువతి ఆత్మహత్య

Meerpet: రాచకొండ కమిషనరేట్ మీర్‌పేట్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందని మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. అల్మాస్‌గూడ ఎస్ఎస్ఆర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న విహారిక అనే యువతికి.. అదే కాలనీలో నివాసం ఉంటున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువకుడు జైకృష్ణ పెళ్లికి నిరాకరించడంతో.. ఈనెల 17న విహారిక ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఈనెల 18న యువతిని తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు జై కృష్ణ. విహారికను పెళ్లి చేసుకోమని యువతి తల్లిదండ్రులు కోరిన జైకృష్ణ నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఆత్యహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

Tags:    

Similar News