Ramachandra Reddy: 95 ఏళ్ల వయసులో సర్పంచ్ పీఠమెక్కిన రామచంద్రారెడ్డి
Ramachandra Reddy: వయసు కేవలం అంకె మాత్రమేనని సూర్యపేట జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి నిరూపించారు.
Ramachandra Reddy: వయసు కేవలం అంకె మాత్రమేనని సూర్యపేట జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి నిరూపించారు. 95 ఏళ్ల వయసులో నాగారం గ్రామ సర్పంచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని ఆయనను అభినందించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న తదితరులు హాజరై రామచంద్రారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగారం అభివృద్ధిలో ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని తెలిపారు.