Hyderabad: క్రిప్టో కరెన్సీ ముసుగులో భారీ మోసం.. తాజ్ డెక్కన్ పార్కింగ్‌లో కోటి నగదు దోపిడీ
Crypto Fraud in Hyderabad: హైదరాబాద్‌లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది.
Hyderabad: క్రిప్టో కరెన్సీ ముసుగులో భారీ మోసం.. తాజ్ డెక్కన్ పార్కింగ్‌లో కోటి నగదు దోపిడీ
Crypto Fraud in Hyderabad: హైదరాబాద్‌లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ ‘తాజ్ డెక్కన్’ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా కోటి రూపాయల నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుడు అత్తాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు.
హోటల్ పార్కింగ్ ప్లేస్‌లో నగదును అందుకున్న సదరు కేటుగాడు, బాధితుడి కళ్లుగప్పి ఆ భారీ మొత్తంతో క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి పంజాగుట్ట పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.