Sarpanch Elections: సర్పంచ్‌ ప్రమాణస్వీకారంలో గందరగోళం.. ఇద్దరికీ గెలుపు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు

Sarpanch Elections: వరంగల్ జిల్లా దామరవంచ గ్రామంలో సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

Update: 2025-12-22 11:29 GMT

Sarpanch Elections: సర్పంచ్‌ ప్రమాణస్వీకారంలో గందరగోళం.. ఇద్దరికీ గెలుపు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు

Sarpanch Elections: వరంగల్ జిల్లా దామరవంచ గ్రామంలో సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ మద్దతుదారులు నుజావత్ స్వాతి 3 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే.. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ మద్దతుదారులు డిమాండ్ చేయటంతో... అధికారులు మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారు. అందులో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ మద్దతుదారులు సనప సుజాత విజయం సాధించినట్టు ప్రకటించారు.

దీంతో సర్పంచ్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఇద్దరు నేనంటే.. నేనంటూ... సర్పంచ్ ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే... ఇరువురు తమ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోషల్ మీడియాలో ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుతం ఆ ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో దామరవంచ గ్రామంలో సర్పంచ్‌ ప్రమాణస్వీకారం ఉత్కంఠను రేపింది.

ఇరువురు అభ్యర్థులు గెలిచినట్టు ధృవపత్రాలు చూపడంతో సమస్య మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే.. రిటర్నింగ్ అధికారి మాత్రం.. కాంగ్రెస్ మద్దతుదారులు సనప సుజాత గెలిచినట్టు ధృవీకరించారు. భారీ బందోబస్తు నడుమ సుజాతతో ప్రమాణస్వీకారం చేయించారు.

Tags:    

Similar News