Artificial Intelligence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు
Artificial Intelligence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Artificial Intelligence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు
Artificial Intelligence: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచే ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు గణితంలో ఒక పాఠంగా ఏఏఐని చేర్చేందుకు చర్యలు చేపట్టింది. 1నుంచి 5 తరగతుల వరకు 2 నుంచి 3 పేజీల్లో ఆరు నుంచి 9వ తరగతి వరకు 4నుంచి 5 పేజీల్లో ఏఐ పాఠ్యాంశం ఉండనుంది. పాఠశాల విద్యాశాఖలోని ఓ అదనపు సంచాలకుడు, ఎస్ సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులతో ఏఐ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. ఇది సిద్ధమయ్యేందుకు 15-20 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. కంప్యూటర్, ఏఐ పుట్టుపూర్వోత్తరాలు, ప్రస్తుతం ఎక్కడ వినియోగిస్తున్నారు కొన్ని ఉదాహరణలు చేర్చనున్నారు. సీబీఎస్ఈలో దాదాపు 4ఏళ్లక్రితమే 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఏఐ పాఠాలు చేర్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఫ్రీగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణ కొద్ది రోజు క్రితమే ప్రారంభం కాగా దాన్ని నిలిపివేయాలని ఫిబ్రవరి 28న అధికారులు ముద్రణదారులను మౌఖికంగా ఆదేశించారు. ఏఐ పాఠాలను చేర్చాలన్న నిర్ణయంతో గణితం పుస్తకాల ముద్రణను నిలిపివేశారు. ఇటీవల ప్రభుత్వం విడుద చేసిన తెలంగాణ గణాంకాల నివేదికలో పాత అంశాలు ముద్రితం అవ్వగా ఆయా అంశాలు పాఠ్యపుస్తకాల్లోనూ ఉండవచ్చని భావించిన ఎస్ సీఈఆర్టీ అధికారులు మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మిగతా పుస్తకాల ముద్రణనూ కూడా నిలిపివేశారు. ఎస్ సీఈఆర్టీ అధికారులు పరిశీలించాకే ముద్రించనున్నారని సమాచారం. గణితం పుస్తకాలను మాత్రం ai పాఠాలు చేర్చాక ముద్రిస్తారు. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు సరఫరా చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు మెరుగైన అభ్యసన పద్దతుల కోసం బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ టూల్స్, ఫ్లాట్ ఫాంలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే