రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Update: 2020-06-06 10:29 GMT
Niranjan Reddy (File Photo)

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన నియోజకవర్గ రైతు అవగాహన సదస్సుకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రైతులు అన్ని పంటలు కాకుండా డిమాండ్ ఉన్న పంటలను పండిస్తేనే అధిక లాభం చేకూరుతుందని, రైతులు లాభాల పడతారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాల్లో కరెంట్‌, తాగు, సాగు నీటి సమస్యలు లేకుండా పరిష్కారం అయినట్లు వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.

కోటి ఎకరాల మాగానిని పచ్చగా మార్చడానికి సీఎం కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసారు. ఆ ఘనత ఇంకెవరికీ చెందదని ఆయన అన్నారు. మన దేశంలో పుష్కలంగా వనరులు ఉన్నాయన్నారు. ప్రపంచాన్ని సాకగలిగే శక్తి మన దేశానికి ఉందన్నారు. ప్రజలకు అవసరమైన పంటలనే పండించాలన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్న మంత్రి రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Tags:    

Similar News