Manickam Tagore: నేడు ముఖ్యనేతలతో మాణిక్కం ఠాగూర్ భేటీ
Manickam Tagore: రాహుల్ జోడోయాత్రపై నేతల సమీక్ష
Manickam Tagore: నేడు ముఖ్యనేతలతో మాణిక్కం ఠాగూర్ భేటీ
Manickam Tagore: మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం పార్టీ శ్రేణులను ముఖ్య నేతలు సన్నద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ సమావేశం అవుతున్నారు. మునుగోడులో ప్రచారం, ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ గుండా సాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై నేతలు సమీక్షించనున్నారు. జోడోయాత్రకు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సందర్భంగా మెంబర్ షిప్ బీమా చెక్కులను ఠాగూర్, రేవంత్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు.