నన్ను మళ్లీ నడిపించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు: యువకుడు రాహుల్

హనుమకొండ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2025-09-16 09:49 GMT

హనుమకొండ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయిన రాహుల్, తిరిగి నడవడానికి ప్రభుత్వం అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పారు.

2024 నవంబర్ 2న రాజస్థాన్‌కు రైలులో ప్రయాణిస్తున్న రాహుల్‌ను కొందరు దుండగులు రైలు నుంచి బయటికి తోసేశారు. ఈ దుర్ఘటనలో రాహుల్ తన రెండు కాళ్లను కోల్పోయాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అతనికి వైద్య చికిత్సతో పాటు కృత్రిమ కాళ్లను అమర్చుకోవడానికి ఆర్థిక సాయం అందించింది.

ప్రభుత్వం చూపిన ఉదారతకు కృతజ్ఞతగా, రాహుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ సహాయం తన జీవితానికి కొత్త ఆశను ఇచ్చిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News