తెలంగాణలో కరోనా కేసులు 70: కేసీఆర్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 70 ఉన్నాయని మరో 11 మంది కోలుకున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.

Update: 2020-03-29 16:05 GMT
KCR Press Meet

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాగా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు సూచింది. అనవసరంగా ప్రజలు బయటికి వస్తే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నారు. దీంతో సుమారుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 70 ఉన్నాయని మరో 11 మంది కోలుకున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోసారి నెగిటివ్ రిపోర్ట్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తారని ఆయన తెలిపారు. కరోనా పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా కొత్త కేసులు నమోదు అవకాశం లేదని, మరో 25 వేల 937 మంది పర్యవేక్షణ లో వున్నారని చెప్పారు. కరోనా సోకిన వారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. మార్చి 30లోగా 1899 మందికి క్వారంటైన్ ముగుస్తుందని తెలిపారు.

కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని, ఇంకొన్ని రోజులు ప్రజలు ఓపిక పట్టాలని కేసీఆర్ సూచించారు. హోం క్వారంటైన్ పాటించాలని కోరారు. ఎక్కువమంది గుమిగూడ కుండా వుండాలని తెలిపారు. సర్పంచులు గ్రామాల్లోకి వచ్చేవారికి శానిటైజర్లు ఇవ్వాలని, అడ్డుకోవడం సరైంది కాదన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని,నెలా 15 రోజుల్లోగా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వమే డబ్బులు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అని హామీ ఇచ్చారు.


Tags:    

Similar News