దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు కేసీఆర్ ప్రయత్నం.. మరోసారి ఢిల్లీ బాట...

KCR - Delhi Tour: త్వరలోనే ఢిల్లీలో ధర్నా చేసిన రైతు సంఘాల నేతల్ని కలిసే అవకాశం...

Update: 2022-04-17 01:30 GMT

దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు కేసీఆర్ ప్రయత్నం.. మరోసారి ఢిల్లీ బాట...

KCR - Delhi Tour: దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇందుకు ఆయన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దేశంలో నీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు, వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిపుణులతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానానికి ప్రణాళికలు రూపొందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

దీంతో రైతులు నాణ‌్యమైన, మెరుగైన, దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.తెలంగాణ మాదిరి దేశవ్యాప్తంగా ఒకే వ్యవసాయ పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంతో సమగ్ర వ్యవసాయ విధానానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

అంతేకాదు రెండ్రోజుల్లో మరోసారి ఢిల్లీ వెళ్లి.. గతంలో నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేసిన రైతు సంఘాల నేతల్ని కలవాలని భావిస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, విత్తనాలు, ఎరువుల పంపిణీతోపాటు ఉచిత విద్యుత్ ఇచ్చినవాటిని తెలియజేయనున్నారు. మొత్తానికి వ్యవసాయ పాలసీపై కూడా కీలక సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Tags:    

Similar News