TS Cabinet Meeting: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై..

TS Cabinet Meeting: ఎల్లుండి తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది.

Update: 2021-07-30 15:30 GMT

TS Cabinet Meeting: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై..

TS Cabinet Meeting: ఎల్లుండి తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. హుజూరాబాద్‌ బైఎలక్షన్‌ నేపథ్యంలో ఈ మీటింగ్‌పై అందరి దృష్టిపడింది. కేసీఆర్ మంత్రివర్గం ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని ఉత్కంఠగా మారింది.

తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్‌ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ నాయకుడు మాట్లాడినా ఏ పార్టీ పాదయాత్ర మొదలుపెట్టినా చివరకు హుజూరాబాద్ వద్దే ఆగుతున్నాయి. ఇటు ప్రభుత్వ పథకాలు కూడా హుజూరాబాద్‌ నుంచి మొదలవుతున్నాయి.

ఇలాంటి కీలక టైంలో తెలంగాణ కేబినెట్‌ ఆదివారం సమావేశం కానుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. దళితవాడల్లోని సమస్యలు, అర్హుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు.

తెలంగాణలో 50వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఆగస్ట్‌ 10వ తేదీవరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వరద నిర్వహణ బృందం ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌, పంటల సాగు అంశాలను ఈ కేబినెట్‌ భేటీలో ప్రస్తావించనున్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై మంత్రులు చర్చించనున్నారు. మరోవైపు థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో బెడ్స్, మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా సిద్ధంగా ఉండాలని వైద్య అధికారులకు కేబినెట్‌ సూచించనుంది.

Tags:    

Similar News