Telangana Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం

Telangana Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.

Update: 2025-10-16 05:49 GMT

Telangana Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం

Telangana Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. మంత్రివర్గం భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టులో హియరింగ్‌ జరగనుంది. దీనిపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రిజర్వేషన్లు, ఎన్నికల ప్రణాళికలపై మంత్రివర్గం చర్చించనుంది. మరోవైపు ప్రభుత్వ ప్రధాన విధానాలు, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాభివృద్ధిలో చాలా కీలకం కానున్నాయని సమాచారం.

అలాగే.. ఈ కేబినెట్‌ భేటీలో వ్యవసాయంపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రైతు భరోసా స్కీమ్‌ రేవంత్‌ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతులకు మరింత మేలు జరిగే విధంగా, నూతన చర్యలు తీసుకునే దిశగా నిర్ణయాలు వెలువడవచ్చని సమాచారం. అదేవిధంగా.. మైనింగ్ కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్‌ ఉంది. రోడ్లు, మెట్రో రైల్‌ ఫేజ్-2 టెండర్లకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మెట్రో రైల్ ఫేజ్-2కు సంబంధించి రోడ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై కూడా కీలకంగా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పలువురు మంత్రుల వివాదాస్పద వైఖరిపై కేబినెట్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించి హెచ్చరికలు జారీ చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News