నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. ఈ ప్రోగాంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అభయ్ పాటిల్, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పాత్రపై చర్చించనున్నారు. రాబోయే మున్సిపల్, GHMC ఎన్నికలపై నేతలకు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు దిశానిర్దేశం చేయనున్నారు.