Telangana Assembly: ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. హిల్ట్ పాలసీపై హీట్
ఐదో రోజుకు చేరుకున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్‌పై అసెంబ్లీలో చర్చ తెలంగాణ భవన్‌లో సమాంతర అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ రెడీ అసెంబ్లీలో జరిగే చర్చలపై కౌంటర్ ఇవ్వనున్న బీఆర్ఎస్
Telangana Assembly: ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. హిల్ట్ పాలసీపై హీట్
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ రసవత్తరంగా జరగనున్నాయి. హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్ పై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరగనున్నది. హిల్ట్ పాలసీపై ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరిగాయి. అసెంబ్లీలో మరోసారి చర్చ నేపథ్యంలో సభ మరింత హీటక్కనుంది. హిల్ట్ పాలసీపై ప్రభుత్వం అధికారిక సమాధాం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రజల్లో నెలకొన్న అపోహలను తలొగించాలనే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడం అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తుంది. అదే విధంగా శానమండలిలో పలు బిల్లులపై సభ్యులు చర్చించనున్నారు. మరో వైపు తెలంగాణ భవన్ లో సమాంతర అసెంబ్లీ సమావేశానికి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అసెంబ్లీలో జరిగే చర్చలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వనున్నది.