తెలంగాణ అసెంబ్లీ అర్ధాంతరంగా ముగించే అవకాశం

Update: 2020-09-16 02:40 GMT

నేడు తెలంగాణ శాసనసభ & మండలి వర్షాకాల సమావేశాలు ఎనిమిదో రోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభల్లో మొదట గంట సమయం ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. రోజురోజుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసులు, అసెంబ్లీ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలను అర్ధాంతరంగా ముగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కీలక బిల్లులు ఆమోదంతో సమావేశాల ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీనిపై మంగళవారం బీఏసీ సమావేశంలో కాంగ్రెస్, ఎంఐఎం పక్షాల అభిప్రాయం తీసుకున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే కీలక అంశాలు ప్రజా సమస్యలపై చర్చ కోసం మరికొద్ది రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో నేడు మరోసారి అధికార ప్రతిపక్షాల తో బిఎసిలో, చర్చించి సమావేశాల కుదింపుపై స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలావుంటే బుధవారం గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. శాసన మండలిలో విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

ఉదయం శాసనసభలో చర్చకు రానున్న ఆరు ప్రశ్నలు..

1)రైతుబంధు సాయం,

2) ఆరోగ్యలక్ష్మి,

3) యూరియా సరఫరా,

4) మాతా, శిశు సంరక్షణా కేంద్రాలు,

5) కరోనా కారణంగా డిజిటల్ బోధన,

6) మధ్యాహ్న భోజన పథకం అంశాలు చర్చకు రానున్నాయి.

శాసనమండలిలో చర్చకు రానున్న ప్రశ్నలు..

1) జీహెచ్​ఎంసీ- జలమండలికి బడ్జెట్ కేటాయింపులు,

2)దివ్యాంగుల ధ్రువపత్రాల జారీ,

3) అనీస్-ఉల్-గుర్బా నిర్మాణం,

4)వార్డు అధికారుల నియామకం,

5)వేయి స్తంభాల గుడి అభివృద్ధి,

6) మైనార్టీలకు గురుకుల కళాశాలలు

Tags:    

Similar News