32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు.. కార్పొరేటర్ల దాడిని ఖండించిన తలసాని
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు.. కార్పొరేటర్ల దాడిని ఖండించిన తలసాని
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు. దీంతో 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం కార్యకర్తలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు దౌర్జన్యం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు మంత్రి తలసాని.
సమస్యలు ఉంటే మేయర్‌ను కలిసి చర్చించాలి కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాతో కౌన్సిల్ సమావేశాలు జరగలేదన్న ఆయన హైదరాబాద్ అభివృద్ధి చేయాలని తమకే ఎక్కువ ఉత్సాహం ఉందన్నారు. ఇకపై బాధ్యతగా వ్యవహరించకపోతే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి తలసాని.