Talasani Srinivas Yadav: గణేష్ నిమజ్జనోత్సవాలపై ఆందోళన అవసరం లేదు..
Ganesh Immersion 2022: గణేష్ నిమజ్జనోత్సవాలపై ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Talasani Srinivas Yadav: గణేష్ నిమజ్జనోత్సవాలపై ఆందోళన అవసరం లేదు..
Ganesh Immersion 2022: గణేష్ నిమజ్జనోత్సవాలపై ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొంతమంది దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారనీ అది దుర్మార్గమైన చర్యేనన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా బ్రహ్మాడంగా పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఇందుకోసం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక నిధులుతో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనోత్సవాలపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన హిందువుల పండుగలు అని మాట్లాడుతున్నారనీ అయితే తామెవరిమని ప్రశ్నించారు మంత్రి తలసాని ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు మాని ప్రజలకుప్రశాంత వాతారవణంలో పండుగలు జరుపుకునేలా చూడాలన్నారు.