Karimnagar: స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన నగర మేయర్ సునీల్ రావు

నగరంలోని స్మార్ట్ సిటీ పనులను నగర మేయర్ సునీల్ రావు పరిశీలించారు. నగరంలోని 6, 7 డివిజన్లలో జరుగుతున్న పనులనుపరిశీలించి, నాణ్యత విషయంలో రాజీపడకూడదని కాంట్రాక్టర్లకు సూచించారు.

Update: 2020-03-13 08:44 GMT
sunil rao observed smart city works

కరీంనగర్ టౌన్: నగరంలోని స్మార్ట్ సిటీ పనులను నగర మేయర్ సునీల్ రావు పరిశీలించారు. నగరంలోని 6, 7 డివిజన్లలో జరుగుతున్న పనులనుపరిశీలించి, నాణ్యత విషయంలో రాజీపడకూడదని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలనీ ప్రజలు పనులు నత్తనడక జరుగుతున్నాయని కోరగా, వెంటనే పనులుత్వరితగతిన పూర్తి చేసి, ఏప్రిల్ ఫస్ట్ నుండి నీళ్ళు వచ్చే విధంగా ఇంటింటికి చర్యలు చేపట్టాలని అన్నారు. వచ్చేది వేసవికాలం కావున ట్యాంకర్లతో నీళ్ళు పోసేప్రసక్తే లేదు. కాబట్టి ఇంటింటికీ ఈ రోజు నీరు వచ్చే ఈ విధంగా పనులు పూర్తి చేయాలని చెప్పారు.

పలు వాడలో అస్తవ్యస్తంగా ఉన్న పనులను పరిశీలించి,వాటిని పూర్తిస్థాయిలో సరిదిద్ది పనులు చేయాలన్నారు.డ్రైనేజీలు, రోడ్లు, పైపులైన్లు, మంచి నీటి పైపులు, పార్కులు, చౌరస్తా ఏరియాలోని కుడళ్లను పరిశీలించి,ఇక్కడ ఇక్కడ పనులు అవసరమో అక్కడ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు మరోమారు సూచించారు. పనులు జాప్యం జరగకుండాత్వరితగతిన పనులు పూర్తి చేయాలని, మరోమారు కాంట్రాక్టర్లకు హెచ్చరించారు.


Tags:    

Similar News