మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులకు అస్వస్థత

* చికిత్స పొందుతున్న విద్యార్థులు.. ఎలాంటి ప్రమాదం లేదనన్న వైద్యుడు

Update: 2022-11-12 05:40 GMT

మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల హెడ్మాస్టర్ ఏగొండ, టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అస్వస్థతకు గురయిన విద్యార్థులను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు శరత్‌కుమార్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. మధ్యాహ్న భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ శరత్‌కుమార్ తెలిపారు.

Tags:    

Similar News