హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న వీధి కుక్కలు

Update: 2020-06-05 05:35 GMT

అసలే ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్.. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు హైదరాబాద్ వాసులకు మరో కష్టం కూడా వచ్చి పడింది. కాలు బయట పెడితే చాలు పిక్క పట్టేసే కుక్కలు అడుగడుగునా మాటేసి ఉన్నాయ్ లాక్ డౌన్ సడలించినా కాలు బయట పెట్టాలంటే హడలిపోతున్నారు.

నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధి కుక్కల బారిన పడి ఎంతో మంది గాయాల పాలు అవుతున్నారు. నగరంలో ప్రతీ వీధిలో కుక్కలు పదుల సంఖ్యలో ఉన్నాయి. నగరం మొత్తంగా వెయ్యికి పైగా వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీ లలో కుక్కులు మనిషి కనిపిస్తే చాలు అమాంతం మీదపడి దాడులు చేస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలం లో ఈ కుక్కుల బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఈ కుక్కులు కుమ్మెస్తున్నాయి.

అయితే ఈ సారి ఎండాకాలంలో కుక్కలను పట్టుకోవడంలో జి ఎచ్ ఎంసి కొంత నిర్లక్ష్యంగా వహించిందనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా కరోనా కంటోన్మెంట్ జోన్ల పర్యవేక్షణతోనే సరిపోయింది దానితో వీధి కుక్కలను పట్టుకోలేదు. మరోవైపు జనం ఇళ్లకే పరిమితమవడంతో కుక్కలకు ఆహారం దొరకడం కష్టమైపోయింది. రోడ్లపై జనసంచారం లేకపోవడంతో పారేసే వేస్ట్ ఫుడ్ కూడా లేకుండా పోయింది. ఆకలికి తట్టుకోలేక మనుషులు కనిపిస్తే చాలు కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు సీజన్ మారి వర్షాకాలంలోనూ కుక్కల బెడద తగ్గడం లేదు. కొత్తగా ప్రవర్తిస్తూ మనుషుల మీద దాడులు చేస్తున్నాయి.

మున్సిపల్‌ అధికారులు వీధి కుక్కలను ఒక వీధిలో పట్టుకొని మరో వీధిలో వదిలివేయడం ఆనవాయితీగా మారింది. వీటికి శాశ్వత పరిష్కారం లేకపోవడంతో కార్పోరేషన్‌ శాఖకు కూడా కుక్కల బెడద తలకు మించిన భారంగా మారింది. దీనికితోడు జంతు ప్రేమికులు కుక్క లను చంపొద్దని ఉద్యమించడంతో కుక్కలను పట్టుకోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా మున్సి పల్‌ అధికారులు కుక్కలను పట్టుకొని నిర్మానుష్య ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags:    

Similar News