రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కల స్వైరవిహారం.. దొరికిన వారిని దొరికినట్లు కరుస్తున్న కుక్కలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎవరు దొరికితే వారిని కుక్కలు కరుస్తుడటంతో… చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు కుక్కలు వీధుల్లో తిరుగుతూ… భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికులు కుక్కలను తరిమే ప్రయత్నించినప్పటికీ కరుస్తూంఉండటంతో… ఆగ్రహంతో కొందరు కుక్కలను కొట్టి చంపేస్తున్నారు.
ప్రత్యేకంగా బి.వై.నగర్, గోపాల్ నగర్, వెంకట్రావు నగర్, గోపాల్ నగర్,ఇందిరానగర్, కొత్త బస్టాండ్ ఏరియాల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. గంటల వ్యవధిలోనే దాదాపు 52 మందిపై కుక్కలు దాడులు చేశాయి. కుక్కకాటుకు గురైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు ప్రజలు గాయాలతో ఆసుపత్రులకు వెళ్తుంటే… మరోవైపు మున్సిపల్ సిబ్బంది కనిపించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద ఇలాగే కొనసాగితే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.