Warangal: 15 ఏళ్లనాటి బోరు నుంచి.. దానంతట అదే పైకి ఉబికి వస్తున్న నీరు
Warangal: వరంగల్ జిల్లా కట్ర్యాలలో వింత ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోంచి నీరు పైకి ఊబికి వచ్చింది.
Warangal: 15 ఏళ్లనాటి బోరు నుంచి.. దానంతట అదే పైకి ఉబికి వస్తున్న నీరు
Warangal: వరంగల్ జిల్లా కట్ర్యాలలో వింత ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోంచి నీరు పైకి ఊబికి వచ్చింది. వాడని బోరులోంచి నీరు రావడం చూసి స్థానిక రైతులు ఆశ్చర్యపోతున్నారు. తనకున్న ఎకరం పొలంలో 200 అడుగులతో 15 సంవత్సరాల క్రితం బోరు వేయగా నీటి చుక్క కూడా రాలేదని తెలిపాడు రైతు. ఇన్నేళ్లకు వాడని బోరు నుంచి మళ్లీ నీరు రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ లేకుండానే నిర్విరామంగా వస్తున్న నీటిని తన పంట సాగుకు వినియోగిస్తున్నట్లు రైతు కిరణ్ తెలిపాడు.