Sriramsagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద .. 26 గేట్లు ఎత్తివేసిన అధికారులు
Sriram Sagar Project: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా పెరిగిన ఇన్ ఫ్లో
Sriramsagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద .. 26 గేట్లు ఎత్తివేసిన అధికారులు
Sriram Sagar Project: గంట గంటకు శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా ఇన్ ఫ్లో పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తుంది. ఎగువన మహారాష్ట్రలోని బాలేగావ్, విష్ణుపురి ప్రాజెక్ట్ లతో పాటు నిర్మల్ జిల్లా గడ్డేన్న వాగు నుంచి ఎస్సారెస్పీకి వరద నీరు వచ్చి చేరుతోంది. మొదట 8 గేట్లు ఎత్తిన అధికారులు తర్వాత 18 గేట్లు, ఆ తర్వాత 26 గేట్లను ఎత్తి దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా... లక్ష 50 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నీటిమట్టం 90 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 77 టీఎంసీల నీరు వచ్చి చేరింది.