Sri Ganesh: సానుభూతి కంటే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ముఖ్యం

Sri Ganesh: కంటోన్మెంట్‌లో బీజేపీ గెలుపు తథ్యం

Update: 2023-11-16 10:15 GMT

Sri Ganesh: సానుభూతి కంటే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ముఖ్యం

Sri Ganesh: కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు తథ్యమని కంటోన్మెంట్ BJPఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్‌లో రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కవాడిగూడ నుండి పోటీ చేసి ఓడిపోయిన లాస్య నందిత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం హాస్యాస్పదమన్నారు. కంటోన్మెంట్ దివంగత నేత సాయన్న కుమార్తె తన తండ్రి పేరు చెప్పుకొని ఓటు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. సానుభూతి కంటే ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ముఖ్యమని ప్రజలంతా బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Tags:    

Similar News