Kamareddy: పాము కాటుతో తండ్రీకొడుకు మృతి

Kamareddy: రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి, కొడుకులకు పాము కాటు

Update: 2023-07-22 07:26 GMT

Kamareddy: పాము కాటుతో తండ్రీకొడుకు మృతి

Kamareddy: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం మూడు మామిళ్ల తండాలో విషాదం చోటు చేసుకుంది. మూడు మామిళ్ల తాండాలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రీకొడుకులకు పాము కాటు వేయడంతో ఇద్దరూ మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మామిళ్ల తండాకు చెందిన రవి , ఆయన కొడుకు వినోద్ రాత్రి గాఢ నిద్రలో ఉండగా.. వారిద్దరినీ పాము కాటేసింది. వినోద్ ఇంట్లోనే మృతి చెందాడు. అయితే తండ్రి రవికి పాము కాటు వేయగానే మెలుకువ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు రవిని ఆసుపత్రికి తరలించారు. ఈ లోపే రవి కూడా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.

Tags:    

Similar News