Nalgonda: మిర్యాలగూడలో రైస్‌ మిల్లర్ల ఆగడాలు

*ధాన్యం ఖరీదు చేసి బిల్లు ఇవ్వని మిల్లు ఓనర్లు *తేమ, తరుగు అంటూ చుక్కలు చూపిస్తున్న వైనం

Update: 2021-11-01 06:48 GMT

మిల్లర్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన ఎస్సై

Nalgonda: నల్గొండ జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది. దీంతో మిర్యాలగూడలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైసు మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోపక్క రేటుతో పాటు తేమ, తరుగు అంటూ రైతులకు చుక్కలు చూపెడుతున్నారు మిల్లర్లు.

కనీసం ధాన్యాన్ని ఎంతకు ఖరీదు చేశారో కూడా బిల్లులో పొందుపర్చడం లేదు. బాధితుల గోడు విన్న ఎస్సై సుధీర్‌కుమార్‌ మిల్లర్లకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. బిల్లులో రేటు ఏదంటూ నిలదీశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తగ్గేదేలేదంటూ నిలబడ్డారు ఎస్సై.

ఇక్కడ కాకపోతే ఉద్యోగం వేరే దగ్గర చేస్తా భయపడేదే లేదు. దీని మీద రేటు చూపియి ఫస్ట్ అంటూ సింగం స్టైల్లో మిల్లర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మిర్యాలగూడ రూరల్ ఎస్సై సుధీర్ కుమార్. మిర్యాలగూడ ప్రాంతం రైస్ మిల్లులకు ప్రసిద్ధి.

వరికోతలు మొదలు కావడంతో రైతులు ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకొస్తున్నారు. మిల్లర్లు మద్దతు ధర చెల్లించకపోవడంతో రోజుల తరబడి మిల్లుల ఎదుట రైతులు పడిగాపులు కాస్తున్నారు. మిల్లర్ల వైఖరితో విసిగిపోయిన రైతులు రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

అధికారులు స్పందించే వరకూ వెనక్కి తగ్గేది లేదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన మిర్యాలగూడ రూరల్ ఎస్సై సుధీర్ కుమార్ రైతుల గోడును విన్నారు. వారు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన ఆయన మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు.

తాను ట్రాన్స్‌ఫర్ అయినా ఫర్వాలేదు గానీ, రైతులకు న్యాయం చేయాలని మిల్లర్లకు సూచించారు. మీకు రైతుల బాధలు పట్టవా? అని మిల్లర్లను ప్రశ్నించిన ఎస్సై రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. దగ్గరుండి మరీ రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని దిగుమతి చేయించారు ఆయన. 

Tags:    

Similar News