Betting Apps Case : బెట్టింగ్ యాప్ కేసులో పోలీసుల విచారణకు హాజరైన శ్యామల

Update: 2025-03-24 05:38 GMT

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెలంగాణ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరిని విచారించారు.

తాజాగా నేడు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే శ్యామలను అరెస్టుచేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

కాగా ప్రముఖుల నటులపై కేసులు నమోదు అవుతున్నసంగతి తెలిసిందే. పలువురు ప్రముఖ నటులు, సోషల్ మీడియాఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు అయ్యింది. వీరిలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, ప్రణీత, నీతూ అగర్వాల్‌ ఉన్నారు. అదే విధంగా శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతికృష్ణన్‌, శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్‌, పద్మావతి, పండు, ఇమ్రాన్‌ఖాన్‌, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ, బండారు సుప్రిత పై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News