Karimnagar: మహిళల సాధికారత,ఆర్థికాభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టాలి
Karimnagar: కరీంనగర్‌లో జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా సమావేశంలో మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని గూడెం లక్ష్మీ డిమాండ్ చేశారు.
Karimnagar: మహిళల సాధికారత,ఆర్థికాభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టాలి
కరీంనగర్: మానవ సమాజంలో సృష్టికి మూలమైన మహిళలను చిన్న చూపు చూస్తే ఊరుకునేది లేదని, మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధి పై కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎంపీటీసీ గూడెం లక్ష్మీ డిమాండ్ చేశారు.
కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కొట్టె అంజలి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన గూడెం లక్ష్మీ మాట్లాడుతూ సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కూడా మహిళల పట్ల వివక్షత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన హక్కులు,చట్టాలు నిస్పక్ష పాతంగా పాలకులు అమలు చేయాలని, మహిళలలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా,రాజకీయంగా అభివృద్ధి చేయడానికి పాలక ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, ఎప్పటికప్పుడు మహిళల్లో ధైర్యాన్ని కల్పించాలని, మహిళలకు కల్పించిన రిజర్వేషన్ల ను అమలు చేయాలని, వారికి ప్రాధాన్యత కల్పించి మహిళల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు.
మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి..
మహిళలు అధికారిక పదవుల్లో ఉన్నప్పటికీ పురుషుల పెత్తనం కొనసాగుతుందని దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, సమాజంలో నేటికి మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వాటిని నియంత్రించడానికి చట్టాలను పకడ్బందీగా అమలు చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు వేగవంతం అవుతున్న తరుణంలో కూడా వరకట్న వేధింపులు జరగడం దారుణమని, అత్యాచారాలకు గానీ, వేధింపులకు గానీ ఎవరైనా పాల్పడితే మహిళలు ధైర్యంగా ప్రతిఘటించాలని గూడెం లక్ష్మీ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యుజిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి కొట్టె అంజలి,నాయకురాళ్లు నక్క కేతవ్వ ఎలిశెట్టి భారతి,కందుకూరి సావిత్రి,రాగుల రేణుక,ర్యాకం మల్లిక, కాట్నపల్లి అఖిల,జీ.వాణి,ఎన్.శాంత,స్వప్న,సుజాత,గుమ్మడి సుజాత,రజిత,సావిత్రి తదితరులు పాల్గొన్నారు.