Shabbir Ali: బతికినా.. చచ్చినా.. కామారెడ్డి ప్రజలతోనే
Shabbir Ali: సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధంగా ఉన్నా
Shabbir Ali: బతికినా.. చచ్చినా.. కామారెడ్డి ప్రజలతోనే
Shabbir Ali: తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వయంగా తానే పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీమంత్రి షబ్బీర్ అలీ పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమేనని, ఇది కాంగ్రెస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి మధ్య పోటీ అని అన్నారు.
తాను బతికిన, చచ్చిన కామారెడ్డిలోనే ఉంటానని మాజీమంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ఓటమి చెందుతారని భావించే.. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారని విమర్శించారు. ప్రజలే ఓటు ద్వారా సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్తారంటున్న మాజీమంత్రి షబ్బీర్ అలీ.