TSPSC Paper Leak: పేపర్‌ లీకేజీ కేసులో రెండోరోజు ముగిసిన సిట్‌ విచారణ

TSPSC Paper Leak: క్వశ్చన్‌ పేపర్లు ఎలా లీక్‌ అయ్యాయి..? దీనివెనుక ఎవరున్నారనే కోణంలో ప్రశ్నలు

Update: 2023-03-19 12:40 GMT

TSPSC Paper Leak: పేపర్‌ లీకేజీ కేసులో రెండోరోజు ముగిసిన సిట్‌ విచారణ

TSPSC Paper Leak: TSPSC పేపర్‌ లీకేజీ కేసులో రెండోరోజు సిట్‌ విచారణ విచారణ ముగిసింది. 7 గంటల పాటు తొమ్మిది మంది నిందితులను సిట్‌ అధికారులు విచారించారు. క్వశ్చన్‌ పేపర్లు ఎలా లీక్‌ అయ్యాయి..? దీనివెనుక ఎవరెవరున్నారు..? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయన్న కోణంలో నిందితులను ప్రశ్నించారు. రాజశేఖర్‌, ప్రవీణ్‌ల నుంచి కీలక సమాచారం రాబట్టారు సిట్‌ అధికారులు. ఐపీ అడ్రస్‌లు మార్చి కంప్యూటర్‌లోకి లాగిన్‌ అయి.. క్వశ్చన్‌ పేపర్లను దొంగిలించినట్టు రాజశేఖర్‌ అంగీకరించాడు. రాజశేఖర్‌ నుంచి ప్రవీణ్‌, రేణుక ద్వారా క్వశ్చన్‌ పేపర్లు చేతులు మారినట్టు వాంగ్మూలం రికార్డ్‌ చేశారు. కాన్ఫిడెన్షియల్‌ ఆఫీస్‌లోని CPU, హార్డ్‌డిస్క్‌లను సిట్‌ అధికారులు పరిశీలించారు.

Tags:    

Similar News