Kamareddy: నేడు కామారెడ్డి బంద్‌కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు

Kamareddy: కామారెడ్డిలో హై అలర్ట్‌

Update: 2023-01-06 03:13 GMT

Kamareddy: నేడు కామారెడ్డి బంద్‌కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు

Kamareddy: కామారెడ్డిలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీసింది. నేడు కామారెడ్డి బంద్‌కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. నిన్న కలెక్టరేట్‌ వద్ద జరిగిన రైతుల ఆందోళనతో ముందస్తుగా రైతు జేఏసీ, బీజేపీ ముఖ్య నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News