పిట్లం మండల కేంద్రంలో ఇండి క్యాష్ ఏ టి ఎం చోరికి యత్నం

మండల కేంద్రంలో హైదరాబాద్ - నాందేడ్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇండిక్యాష్ కంపెనీకి చెందిన ఏటీఎం చోరీకి గురికాబడింది. ఏటీఎం నిర్వాహకులు రాత్రి సమయంలో ఏటీఎం దుకాణంకు ఉన్న షెట్టర్ ను మూసివేశారు.

Update: 2020-03-11 08:04 GMT

పిట్లం: మండల కేంద్రంలో హైదరాబాద్ - నాందేడ్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇండిక్యాష్ కంపెనీకి చెందిన ఏటీఎం చోరీకి గురికాబడింది. ఏటీఎం నిర్వాహకులు రాత్రి సమయంలో ఏటీఎం దుకాణంకు ఉన్న షెట్టర్ ను మూసివేశారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం వద్దకు చేరుకొని ముందుగా గునపాలతో శెట్టర్ ను ధ్వంసం చేసిలోనికి ప్రవేశించి ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అది సాధ్యపడక పోవడంతో మిషన్ వదిలేసి వెళ్లిపోయారు. పిట్లం ప్రధాన రహదారిలో వినియోగదారుల అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకునేందుకు ఇండిక్యాష్ ఏజెన్సీ వారు ఏటీఎంను ఏర్పాటు చేశారు. పగలంతా ఏటీఎంను తెరిచి లావాదేవీలు నిర్వహిస్తారు. రాత్రి కాగానే ఏటీఎం మూసివేస్తారు. ప్రతి రోజులు మాదిరి గానే పగలంతా లావాదేవీలు నిర్వహించి రాత్రి మూసివేశారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఏటీఎం శెట్టర్ను గునపాలతో పైకి లేపి మిషన్లో నుంచి డబ్బులు తీసుకుందుకు ప్రయత్నించారు.

ఎంతకు ఏటీఎం తెరుచుకోకపోవడంతో మిషన్ ను పగులగొట్టి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో మిషన్ అక్కడే వదిలి పరారయ్యారు. ఉదయం పూట ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారు. అయితే ఏటీఎం తెరుచుకోకపోవడంతో అందులో ఉన్న డబ్బులు దుండగులకు దక్కలేదు. గతంలో కూడా ఈ ఏటీఎం సెంటరుపై దుండగులు చోరీకి యత్నించారు. అప్పుడు కూడా డబ్బులు దుండగులకు దక్కలేదు.



Tags:    

Similar News