Madnoor: ఏఎంవిఐ ఆధ్వర్యంలో రహదారి భద్రత వారోత్సవాలు

శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించారు.

Update: 2020-01-31 10:42 GMT

మద్నూర్: వాహనం నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ప్రమాదాలు జరగకుండ అరికట్టవచ్చని అసిస్టెంట్ మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ నవీన్, మద్నూర్ ఎస్సై సురేష్, ఏఎస్ఐ దేవాకతే వెంకట్ రావులు పేర్కొన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వాహన చోదకులు చిన్న, చిన్న తప్పులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.

ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబం వీధిన పడుతుందని తెలిపారు. పిల్లలు, తమ బంధువులు వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించేలా చెప్పాలన్నారు. అనంతరం సదస్సుకు హాజరైన వారిచే, రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు. 


Live Updates
NO MORE UPDATES
Tags:    

Similar News