రెవెన్యూ ఉద్యోగుల్లో కొనసాగుతున్న భయాందోళనలు
-ఈనెల 13, 14, 15, 16 తేదీలలో పలు రూపాల్లో నిరసనలు -13, 14 తేదీల్లో రెవెన్యూ కార్యాలయాల్లో పెన్ డౌన్
తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగుల్లో నేటికి భయాందోళనలు కొనసాగుతున్నాయి. తహశీల్దార్ సజీవదహనం.. ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. ఈమేరకు తమ ప్రాణాలకు ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చే వరకూ నిరసన కొనసాగిస్తున్నారు రెవెన్యూ జేఏసీ. ఈ కార్యాచరణలో భాగంగా ఈనెల 13, 14, 15, 16 తేదీల్లో పలు రూపాల్లో నిరసన తెలుపనున్నారు. 13, 14 తేదీలలో తహశీల్దార్ కార్యాలయాలలో ఉండాలని, పని వేళల్లో విధులు బహిష్కరించి నిరసన తెలియచేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకూ ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. 15వ తేదీ రెవెన్యూ కార్యాలయాల్లో వంటావార్పు కార్యక్రమాలు చేపట్టాలని, 16వ తేదీ నుంచి భూ సంబంధ విధులను బహిష్కరించాలని కోరారు.