నేడు ఖమ్మం జిల్లాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రేతో కలిసి ఖమ్మం వెళ్లనున్న రేవంత్
నేడు ఖమ్మం జిల్లాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy: నేడు ఖమ్మం జిల్లాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ఇంఛార్జ్ ఠాక్రేతో కలిసి ఖమ్మం వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. జులై 2న జరిగే సభా ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అనంతరం ఖమ్మంలో పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. ఖమ్మం సభకు భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్.. అందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కార్యవర్గ సమావేశం అనంతరం కూసుమంచి మండలంలో భట్టి విక్రమార్కతో భేటీ కానున్నారు.