ఐడీపీఎల్‌ భూములపై విచారణకు తెలంగాణ సర్కార్‌ ఆదేశం

IDPL ల్యాండ్స్‌పై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. 4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్‌ విచారణ జరుపనుంది.

Update: 2025-12-16 07:10 GMT

IDPL ల్యాండ్స్‌పై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది. 4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్‌ విచారణ జరుపనుంది. భూకబ్జాలపై ఇటీవల MLA మాధవరం, MLC కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కూకట్‌పల్లి సర్వేనంబర్‌ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడిపై కవిత ఇటీవల ఆరోపణలు చేశారు. కవిత భర్త అనిల్‌పై ఎమ్మెల్యే మాధవరం భూకబ్జా ఆరోపణలు చేశారు. సంచలనంగా మారిన వివాదంపై విచారణ స్టార్ట్ కానుంది.

Tags:    

Similar News