Revanth Reddy: కేంద్రమంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
Revanth Reddy: ఢిల్లీ పర్యటలో తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ న్ తో భేటీ అయ్యారు.
Revanth Reddy: ఢిల్లీ పర్యటలో తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ న్ తో భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రికి సీఎం విన్నవించారు. తెలంగాణలో 105 YIIRSలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు 30 వేల కోట్ల వ్యయమవుతుందని నిర్మలా సీతారామన్ కు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్ బీఎం నుంచి మినహాయించాలని కోరారు.
మరోవైపు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని ధర్మేంద్రప్రధాన్ కు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు.