కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన.. ఓటరు జాబితాలో మరణించిన వ్యక్తుల పేర్లు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన.. ఓటరు జాబితాలో మరణించిన వ్యక్తుల పేర్లు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరణించిన వారికి కూడా... ఓటు హక్కు కల్పించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో జక్కుల లస్మక్క, అగ్గు గౌరక్క, బొల్లం మధునమ్మ అనే వ్యక్తులు మరణించి ఏడాది పూర్తయినా.. వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదయి ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. జాబితాను పలుమార్లు సవరించినప్పటికీ.. మరణించిన వారి పేర్లు తొలగడం లేదని ఎన్నికల అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.